Sunday, November 17, 2024

Manipur | బీజేపీకి ఎన్‌పీపీ మద్ద‌తు ఉపసంహరణ !

మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీకి షాక్ తగిలింది. మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి… నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఎన్‌పిపి అధ్యక్షుడు, మేఘాలయ సిఎం కాన్రాడ్ కె. సంగ్మా ఉపసంహరణపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశారు.

మణిపుర్‌లో శాంతిభద్రతల సంక్షోభాన్ని పరిష్కరించడంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని… మణిపూర్‌లో హింస, అల్లర్లను అదుపు చేయలేక తక్షణమే మద్దతు ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. మణిపుర్‌ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా 53 స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఇందులో ‘ఎన్​పీపీ’కి 7 సీట్లు ఉన్నాయి.

మణిపూర్ హింసపై అమిత్ షా సమీక్ష !

కాగా, మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement