బహుళ భాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ – కూ – ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ యూజర్ల కోసం అదిరిపోయే బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కొత్త డిజైన్ యూజర్ కేంద్రీకృత విధానంతో రూపొందించబడింది. చూడగానే ఆకట్టుకునేలా, సహజంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మునుపటి వెర్షన్ నుండి గణనీయమైన అప్‌గ్రేడ్ అయ్యింది. ఈసందర్భంగా కూ డిజైన్ హెడ్ ప్రియాంక్ శర్మ మాట్లాడుతూ…. యూజర్ డిలైట్ తమ బ్రాండ్ ఫిలాసఫీలో ప్రధానమైనదన్నారు. తాము తమ యూజర్ ఇంటర్‌ఫేస్ విషయానికి వస్తే, తమ యూజర్ల కు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి నిరంతరం పునరావృతం చేస్తామన్నారు. లీనమయ్యే బ్రౌజింగ్ అనుభవాన్ని పరిచయం చేయడమనేది ప్రపంచంలోని అత్యుత్తమ వివిధ భాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాంను నిర్మించడానికి మొదటి అడుగు అన్నారు. తాము ఇప్పటికే కమ్యూనిటీ నుండి గొప్ప అభిప్రాయాన్ని పొందామని, కూ లో అత్యుత్తమ బ్రౌజింగ్ అనుభవాలను పరిచయం చేయడానికి ఇది ప్రారంభం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement