ప్రభన్యూస్ : ఆగకుండా పెరుతున్న కూరగాయాల ధరలు వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తుండటంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరుగుతున్న వేగంగా తమ వేతనాలు పెరగకపోవడంతో అర్ధకాలితో కొంతమంది మంది ఉంటుంటే మరి కొంతమంది ఒక పూట భోజనంతోనే జీవితాలను భారంగా నెట్టుకొస్తున్నారు. పెరిగిన ధరల కారణంగా సామాన్య మానువుని మంచి పోషకాలను అందించే పప్పు ధాన్యాలు ఏవీ కూడా రూ.200లకు ఇంచుమించు ఏది తక్కువగా ఉండటం లేదు. కంది పప్పు ధర చూసుకుంటే రిటెల్ మార్కెట్ రూ.200 పలుకుతోంది. కంది పప్పుకు బదులుగా వాడుకునే బెంగుళూరు కందిప్పు(ఎర్రపప్పు) రూ.140 తక్కువగా లేదు. మిననప్పు రూ.180, వేరు శనగలు రూ.175 ఈ విధంగా ఏది పప్పు ధర చూసుకున్నా సామాన్య మానవునికి అందుబాటులో లేదు.
పెరిగిన కూరగాయల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారులు…
సామాన్యుని జీవని విధానం పైన ప్ర భావం చూపిస్తున్న పెరిగిన కూరగాయల ధరలతో ఏం తినేటట్లు లేదు. ఏం కొనేటట్టు లేదు అనే పరిస్థితి నెలకొంది. సామాన్య మధ్య తరగతికి భారం. బీరకాయ, దోసకాయ, వంకాయ ఇలా చెప్పుకుంటూ.. వెళ్తే అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావ సర వస్తువుల ధలతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో వినియోగదారులు అందోళన చెందుతున్నరు. పండించిన రైతులే అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మార్కెట్‌లో కూరగాయల ధరలతో పాటు నిత్యవసర వస్తువుల నూనెలు, విపరతీంగా పెరిగి కొనలేని పరిస్థితి నెలకొంటోంది. టమాట కిలో రూ.40, వంకాయ కిలో రూ.50, బెండకాయ కిలో రూ.60, పచ్చిమిర్చి 80, కాకరకాయ కిలో రూ.60, ఫ్రెంచ్ బీన్స్‌కిలో రూ.100, క్యారెట్ కిలో రూ.50 పలుకుతుంది. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఈ విధంగా వేటి ధరలు చూసిన భగ్గుమంటున్నారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఏం కానాలో… ఏం తినాలో దిక్కుతోచని స్థితి సామాన్య మానవుడు సతమతం అవుతున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..