ఉమ్మడి మెదక్ బ్యూరో : తెలంగాణలో 50 ఎళ్ల కష్టాలను కేసీఆర్ పాలన తీర్చిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలోని ములుగు మండలం బండ మైలారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటు ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఉత్త ప్రకటనలు తప్ప ఆచారనే లేదన్నారు. ఉచిత కరెంటు ను ఉత్త కరెంటు చేశారని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. సి ఎం కేసీఆర్ కృషి కారణంగానే తెలంగాణ లో వెలుగులు జిగేల్ మంటున్నాయన్నారు.
బండ మైలారం గ్రామ రూపురేఖలు మార్చింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏళ్ళ నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారని, దేశంలో గజ్వేల్ పేరు, ప్రతిష్ట నిలబెట్టిన ఘనత సి ఎం కేసీఆర్ కె దక్కుతుందన్నారు. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో మన సి ఎం కేసీఆర్ ను గెలిపించాలని గ్రామ ప్రజలకు మంత్రి హరీశ్ పిలుపు నిచ్చారు.