న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం డోనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. చరిత్రాత్మకమైన రెండవసారి బాధ్యతలు చేపట్టిన తన ప్రియమైన స్నేహితుడు’ అని మోదీ అభినందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య జరిగిన ఇదే తొలి సంభాషణ . .
చరిత్రాత్మకంగా చేపట్టిన ప్రియ మిత్రుడికి అభినందనలు’ అని మోదీ ట్వీట్ కూడా చేశారు.
కాగా, రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కు ఈ నెల 20వ తేదీన మోడీ తన ఎక్స్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు
‘అమెరికా అధ్యక్షుడైన నా ప్రియమిత్రుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. చరిత్రాత్మకంగా రెండోసారి అధ్యక్షుడైన ఆయనను అభినందిస్తున్నా. పరస్పరం రెండు దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం అంటూ మోదీ ట్వీట్ చేశారు. అలాగే ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రత, ప్రజల సంక్షేమం కోసం మేం కలిసి పనిచేస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.