అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లపై మంచు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే మంచు తుఫాను కారణంగా మృతుల సంఖ్య 60కి చేరింది. రహదారులంతా కనిపించడం లేదు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు కార్లలో మంచు తుఫానులో ఇరుక్కుపోయి చనిపోతున్నారు. చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమై పోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల సర్వీసులను రద్దు చేయాల్సివచ్చింది. బఫెలో ఎయిర్‌పోర్టులో 43 అంగుళాల మేర మంచు పేరుకుపోయిందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక న్యూయార్క్ లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోడ్లపై గుట్టలుగుట్టలుగా మంచు పోరుకుపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 30-40 ఇంచుల మేర మంచు కప్పుకుపోయినట్లు తెలిపారు. అక్కడి పరిస్థితిని అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి తీసుకెళ్లినట్లు గవర్నర్ క్యాథీ హోచుల్ వివరించారు. ఇక జపాన్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 17 మందికి చేరింది. 93 మంది మిస్సైనట్లు తెలుస్తోంది. అక్కడ చలితీవ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయింది. దీంతో జనం గజగజ వణికిపోతున్నారు. హీటర్‌లు వేసుకుని ఇండ్లలోనే ఉంటున్నారు. జపాన్‌కు ఉత్తరంగా ఉన్న హొకైడో, దక్షిణంగా ఉన్న క్యుషుతో పాటు అర్చిపెలాగో దీవుల్లో మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ మంచు పొరల స్థాయులు 1.20 మీటర్ల స్థాయికి చేరాయి.
Winter Storm : అమెరికా, జపాన్ లో మంచు తుఫాను బీభత్సం… పెరుగుతున్న మృతుల సంఖ్య…
Advertisement
తాజా వార్తలు
Advertisement