Thursday, November 28, 2024

Winter Session – ఏముందీ గ‌ర్వ‌కార‌ణం … నిత్యం వాయిదాల‌తోనే స‌భా స‌మ‌రం

మూడో రోజూ పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో అదాని ర‌చ్చ‌
వెన‌క్కి త‌గ్గ‌ని విప‌క్షాలు.. ప‌ట్ట వీడ‌ని ప్ర‌భుత్వం
రెండు స‌భ‌లో రేప‌టికి వాయిదా

న్యూఢిల్లీ – పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి మూడు రోజులైంది. మూడు రోజుల నుంచి ఉభయసభలను అమెరికాలో అదానీ సంస్థపై కేసుల అంశం కుదిపేస్తుంది. అదానీ సంస్థపై కేసుల గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దాంతో సభలు వాయిదాపడుతూ వస్తున్నాయి. గురువారం కూడా ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.

రాజ్య‌స‌భ‌లో
ఈ క్రమంలో పెద్దల సభను రేపటికి వాయిదా వేసే ముందు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఛాంబర్‌ కేవలం చర్చలకు వేదిక కాదని, అంతకంటే ఎక్కువని, సభ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలకు పూనుకోవద్దని ధన్‌కర్‌ మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంపై చర్చలు జరగాలని అన్నారు. పార్లమెంటరీ వివాదం ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు.

లోక్ స‌భ‌లోనూ..

ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైన వెంట‌నే అమెరికాలో అదానీ సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడంతో లోక్ స‌భ‌లో గందరగోళం నెలకొంది. దాంతో ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభలు పునఃప్రారంభమైన తర్వాత కూడా లోక్ స‌భ‌లో సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. దాంతో స్పీక‌ర్ స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు..

- Advertisement -

కొత్త స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం
ఇవాళ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారాలు చేశారు. వాయనాడ్‌ ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా, నాందేడ్‌ ఎంపీగా రవీంద్ర వసంత్‌రావు చవాన్‌ ప్రమాణం చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా వారితో ప్రమాణస్వీకారం చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement