Wednesday, November 20, 2024

Winter Session – 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

4న అఖిలపక్ష మీటింగ్..
స‌భ‌లో ప్ర‌వేశ పెట్టాల్సిన బిల్లుల‌పై చ‌ర్చ‌
డిసెంబ‌ర్ 20వ తేది వ‌ర‌కు స‌మావేశాలు

న్యూ ఢిల్లీ – నవంబర్ 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నెల 24న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లను సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది.

సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది..ఈ విషయాన్ని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఈ నెల 25 నుంచి మొదలయ్యే పార్లమెంట్‌ సమావేశాలు డిసెంబరు 20న ముగుస్తాయి. ఈ క్రమంలో పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

- Advertisement -

మరోవైపు శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో ఏర్పాట్లను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పరిశీలించారు. ప్రభుత్వం తన ఎజెండాను ప్రతిపక్షాలకు తెలియజేయడానికి పార్లమెంటులో ఏయే పార్టీలు చర్చించాలనుకుంటున్న అంశాలపై చర్చించడానికి సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పలు కీలక అంశాలపై లోకసభ, రాజ్యసభ సభ్యులు చర్చించనున్నారు. అలాగే, పలు బిల్లులను సైతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో వక్ఫ్‌ సవరణ బిల్లుపై జేపీసీ నివేదిక పార్లమెంట్‌ ముందుకు రానుంది. అనంతరం బిల్లును సభలో ప్రవేశపెడతారు. అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లునూ తీసుకురావడనికి ప్రభుత్వం యోచిస్తోంది. మరి అధికార పార్టీ ప్రవేశపెట్టే బిల్లులపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. . .

Advertisement

తాజా వార్తలు

Advertisement