Home ముఖ్యాంశాలు Winter Session : అదానీపై చర్చ జరగాలని కోరుతూ విపక్షాలు ధర్నా

Winter Session : అదానీపై చర్చ జరగాలని కోరుతూ విపక్షాలు ధర్నా

0
Winter Session : అదానీపై చర్చ జరగాలని కోరుతూ విపక్షాలు ధర్నా

న్యూ ఢిల్లీ – పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను ఆదానీ వ్యవహారం, సంభల్‌ హింసాకాండ తదితర అంశాలు కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో నేటి సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.

అదానీ వ్యవహారంపై చర్చ జరగాలని కోరుతూ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీసహా విపక్ష ఎంపీలంతా ధర్నా కు దిగారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అయితే, ఈ నిరసనలకు తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు దూరంగా ఉన్నారు.

Exit mobile version