Saturday, November 23, 2024

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎప్పుడంటే..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. గతేడాది కరోనా కారణంగా శీతాకాల సమావేశాలు జరగలేదు. ప్రస్తుతం వైరస్ తీవ్రత తక్కువగా ఉండడంతో సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఈ సారి సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించనున్నారు. ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు, యూపీ లఖీంపూర్ ఖేరీ ఘటన, కశ్మీర్లో వరసగా ఉగ్రవాదుల దాడులపై ప్రధానంగా చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Huzurabad Bypoll: అభ్య‌ర్థుల‌కు పండ‌గే.. అద‌నంగా రెండు గంట‌ల సమయం

Advertisement

తాజా వార్తలు

Advertisement