బిజెపి సభ్యుడు ప్రతాస్ సారంగికి గాయాలు
కాంగ్రెస్ సభ్యులు తనను తోసివేశారంటూ ఆరోపణ
బిజెపి సభ్యులే తనను అడ్డుకున్నారన్న రాహుల్
న్యూ ఢిల్లీ – లోక్ సభ, రాజ్యసభ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు పట్టుబట్టారు. ఈ క్రమంలో లోక్ సభలోకి వెళ్లేందుకు అధికార , విపక్ష ఎంపీల వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక ఎంపీ తలకు గాయాలయ్యాయి.
కాంగ్రెస్, బిజేపీ పోటాపోటీ నిరసనలు ….
రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యాలను నిరసిస్తూ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ ఫొటోలు పట్టుకొని నిరసన చేశారు. అలాగు పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ ఫొటోలను చేతిలోపట్టుకొని ఉన్నా కాంగ్రెస్ ఎంపీల ఫోటోలను బిజేపీ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసింది. దీంతో కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో గురువారం బిజేపీ క్షమాపణలు చెప్పాలని నిరసన చేశారు. హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ చేస్తున్న నిరసనలను నిర్వీర్యం చేయడానికి బిజేపీ ఎంపీలు కూడా ఆందోళనకు దిగారు.. అమెరికా వ్యాపారవేత్త జార్జి సోరోస్ తో కలిసి దేశాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ కుట్రచేస్తోందని బిజేపీ ఎంపీలు ఆరోపణలు చేస్తూ నిరసనలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలకు పోటీగా బిజేపీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు.
లోక్ సభ స్పీకర్ వెల్ వరకు నిరసనకారులు చేరుకొవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బిజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తలకు గాయాలయ్యాయి. ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా రాహుల్ గాంధీ లోక్ సభలో మరో ఎంపీని తోశారని.. ఆయన తోసిన ఎంపీనే తనపె పడ్డారని ఎంపీ ప్రతాస్ సారంగి మీడియా ముందు ఆరోపణలు చేశారు. బిజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందించారు.
తాను స్పీకర్ వెల్ వరకు వెళుతుంటే బిజేపీ ఎంపీలు తనను అడ్డుకున్నారని.. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సైతం వారు తోసేశారని ఆరోపించారు. ఏం జరిగిందో కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందని అందరూ అది చూడాలని మీడియా ముందు స్పష్టం చేశారు.
అంతకుముందు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ.. అమిత్ షా చేసిన వ్యాఖ్యలలో నుంచి కొంత భాగం చూపి కాంగ్రెస్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను పదపదే బిజేపీ మంత్రులు అవమానిస్తున్నారని అన్నారు. తమ నిరసనల్లో అంబేడ్కర్ ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో ఈ విషయం స్పష్టమవుతోందన్నారు.