డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానంలో జరుగుతోంది. నాలుగో రోజు ఆటతో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రసకందాయంలో పడింది. తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే.. ఆ తర్వాతి రెండు రోజుల్లో భాతర్ కమ్ బ్యాక్ చేసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 164 పరుగులు చేసింది.
భారత్ విజయం సాధించాలంటే చివరి రోజు ఆటలో 280 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 44 బ్యాటింగ్; 7 ఫోర్లు), అజింక్యా రహానే (59 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ (43; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు