నిత్యావసర వస్తువులు ఒక్కోసారి ఒక్కొక్కటి కొండెక్కి కూర్చుంటున్నాయి… మొన్నటి వరకు ఉల్లిపాయలు ధరలు భగ్గుమన్నాయి.. అవి తగ్గంగానే.. ఇప్పుడేమో టమోటా ధరలకు రెక్కలొచ్చాయి.. కిలో టమోటా రూ.110లు పలుకుతున్నాయి.. ఈధరలు ఇలా పెరుగుతుంటే సామాన్యుడి గుండెలు గుభేల్ మంటున్నాయి. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటికే ఆయిల్ రేట్లు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో టమోటా ధరలు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులెదుర్కొంటున్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబేడ మార్కెట్‌లో కిలో టమోటా రూ.110లకి చేరింది. చిల్లర దుకాణాల్లో కిలో రూ.120ల వరకూ విక్రయిస్తున్నారు. ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి. దాంతో ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement