Thursday, September 19, 2024

HYD | రెండు రోజులు మందు బంద్ !

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వైన్స్‌ను మూసివేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో జంటనగరాల్లోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించారు.

17వ తేదీ ఉదయం 6గంటల నుంచి వైన్స్‌ను బంద్ చేయాలని పేర్కొన్నారు. క్లబ్బులు, స్టార్‌హోటళ్లలోని బార్లను మినహాయింపు ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి బంద్ చేయాలని, నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement