కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పది, ఇంటర్ పరీక్షల పై గందరగోళం నెలకొంది. విద్యార్థులు విషయం తెలియక సతమతమవుతున్నారు. అయితే వాస్తవానికి మే 1 నుంచి 19 వరకు ఇంటర్, మే 17 నుండి 26 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి.
ఇక ఈ విషయంపై అటు పిల్లలతో పాటు తల్లిదండ్రులలో కూడా సందిగ్దత నెలకొంది. అయితే దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పరీక్షలు ఎక్కువశాతం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.