Thursday, November 21, 2024

హిండెన్‌బ‌ర్గ్ సంస్థ‌పై దాడి చేయిస్తారా ?.. మంత్రి కేటీఆర్

అదానీ స్టాక్స్‌పై నివేదిక ఇచ్చిన హిండెన్‌బ‌ర్గ్ సంస్థ‌పై ఐటీ దాడి చేయిస్తారా అని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో సుమారు 20 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ముంబైలో ఉన్న బీబీసీ స్టూడియోస్‌లో కూడా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. డాక్యుమెంట్ల‌ను సీజ్ చేశారు. జ‌ర్న‌లిస్టుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల‌ను లాగేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ఆ దాడుల ప‌ట్ల ఆయ‌న ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. కొన్ని వారాల క్రిత‌మే ప్ర‌ధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంట‌రీ ప్ర‌సారం అయ్యింద‌ని, ఇప్పుడు భార‌త్‌లోని బీబీసీ ఆఫీసుల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు న‌వ్వులపాలు అవుతున్నాయ‌ని, ఆ సంస్థ‌లు బీజేపీ కీలుబొమ్మ‌లుగా మారిన‌ట్లు కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నించిన మంత్రి కేటీఆర్‌.. త‌ర్వాత ఎటువంటి చ‌ర్య‌ను తీసుకుంటార‌ని అడిగారు. లేదంటే ఆ సంస్థ‌నే టేకోవ‌ర్ చేసుకుంటారా అని ఆయ‌న విమ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement