ఆస్కార్ వేదికపై విపరీత చర్యకు పాల్పడిన విల్‌స్మిత్ ఎట్టకేలకు పశ్చాత్తాపం వ్యక్తంచేశాడు. క్రిస్‌రాక్‌ను చెంపదెబ్బ కొట్టినందుకు విచారం తెలియజేశాడు. విల్‌స్మిత్ దుందుడుకు చర్యను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్మిత్ దిగొచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్రిస్‌రాక్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాడు. క్రిస్.. నేను మీకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను. నేను తప్పు చేశాను. నా చర్యకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. నేనలా వ్యవహరించడం బాధాకరమే. అది నా వ్యక్తిత్వానికి భిన్నమైనది కూడాను.
ప్రేమ, దయ ఉన్న ప్రపంచంలో హింసకు చోటులేదు. జాడా (తనక్షభార్య) గురించిన జోక్ నన్ను బాధించింది. అందుకే అకస్మాత్తుగా ఉద్రేకానికి లోనయ్యాను. ఏదేమైనా నేను అలా చేసివుండాల్సింది కాదు.. క్షమించు రాక్ అంటూ సందేశాన్ని పోస్టుచేశాడు. ఆస్కార్ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి, ప్రపంచ వ్యాప్తంగా వేడుకలను వీక్షించిన వారందరికీ క్షమాపణలు అని స్మిత్ తన ప్రకటనను ముగించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..