Friday, November 22, 2024

అణుదాడికి దిగితే సహించం: జీ7 కూటమి

ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను ఖాతరు చెయ్యకుండా, ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా క్షిపణుల వర్షం కురిపించడం పట్ల జీ7 దేశాలు మండిపడ్డాయి. మాస్కో దమనకాండకు పుతిన్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ జీ7 దేశాధినేతలు వర్చువల్‌ భేటీలో వార్నింగ్‌ ఇచ్చారు. రష్యా అణ్వాయుధాలు వాడితే తీవ్ర పరిణామాలు తప్పవని జీ7 హెచ్చరించింది. రష్యా మిసైల్‌ దాడులను ఖండించిన జీ7 ఉక్రెయిన్‌కు తక్షణ సైనిక, రక్షణ అవసరాలు, సామాగ్రిని చేరవేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఉక్రెయిన్‌ అవసరాలను తీర్చేందుకు తాము కట్టుబడిఉన్నామని సంయుక్త ప్రకటనలో వెల్లడించింది.

రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ సామర్ధ్యాలను కల్పించాలని జీ7 దేశాలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్ధించారు. మాస్కోపై కఠిన తాజా ఆంక్షలు విధించాలని జీ7 సమావేశంలో జెలెన్‌స్కీ కోరారు. ఇక రష్యా ఎలాంటి రసాయన, జీవ, అణ్వాయుధరాలను వాడినా తీవ్ర పరిణామాలు తప్పవని రష్యాను హెచ్చరిస్తున్నామని జీ7 ప్రకటన పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement