లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తరపున ప్రచారం చేసే విషయమై కమల్ హాసన్ శనివారం మాట్లాడారు. బదులుగా MNMకు రాజ్యసభలో ఒక సీటు (2025) ఇచ్చే విధంగా హామీ పొందినట్లు తెలుస్తుంది.
చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో కమల్ హాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కమల్ హాసన్ మాట్లాడుతూ.. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున ప్రచారం చేస్తానని చెప్పారు.