Friday, November 22, 2024

మెగా డాట‌ర్ నిహారిక భ‌ర్తతో విడిపోనుందా..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికే ఎన్నో జంట‌లు విడాకులు తీసుకున్నాయి. తాజాగా మెగా డాట‌ర్ నిహారిక త‌న భ‌ర్త చైత‌న్య‌తో విడిపోనుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. మెగా డాటర్ గా తనకు స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది నిహారిక‌. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలని ఎంతో ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మొదటగా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి .. ఆ తర్వాత అవకాశాలు హీరోయిన్గా అందుకుంది.. కానీ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు..

కనీసం పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేదు.. అంతలా డిజాస్టర్ టాకులు సంపాదించుకున్నాయి. ఈ హీరోయిన్లు పనులు మనకు వర్కౌట్ అవ్వవు అంటూ ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన పెళ్లిని చేసుకొని సక్సెస్ ఫుల్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే.. తాజాగా నిహారిక, ఆమె భర్త వెంకట చైతన్య ఇద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు ఇన్‌ స్టాలో అన్‌ ఫాలో అయ్యారట. అంతేకాదు.. తమ పెళ్లి ఫోటోలను ఇన్‌ స్టా నుంచి చైతన్య డిలీట్‌ చేశాడని సమాచారం అందుతోంది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని టాక్‌ వినిపిస్తోంది.మ‌రి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ వార్త‌ల‌పై వారు స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement