క్రికెట్‌కు స్వస్తి పలికిన మిధాలీరాజ్…సెకండ్ ఇన్నింగ్స్‌పై దృష్టి సారించింది. ఈ విషయమై తన మనోభావాలను మీడియాతో పంచుకుంది. అడ్మినిస్ట్రేషన్‌లో అవకాశం వస్తే చేయాలని ఉన్నట్టు తెలిపింది. తనకు అలాంటి అవకాశం దక్కితే ఎంతో సంతోషిస్తానంది. ”మహిళల క్రికెట్‌ను మహిళలే బాగా అర్థం చేసుకోగలుగుతారు.
అందువల్ల ఆ పదవిలో మహిళలే ఉండడం ఉత్తమం.లిండా క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఎలా తీర్చిదిద్దిందనే విషయం అందరికీ తెలుసు’ అని పేర్కొంది. ఒకవేళ అటువంటి పదవి తనకు దక్కితే అనుభవాన్నంతా రంగరించి మెరుగైన ఫలితాలు తెచ్చేందుకు యత్నిస్తా” అని తెలిపింది. కోచ్‌గా చేసే అవకాశం వచ్చినా బాగానే ఉంటుందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.