Saturday, November 23, 2024

TG | ఫిరాయింపులపై స్పీకర్‌ చర్యలు తీసుకోకపోతే సుప్రీంకే : కేటిఆర్‌

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసన సభాపతిఎలాంటి నిర్ణయం తీసుకోక‌పోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. స్వీకర్‌ను కోర్టు ఆదేశించే అధికారం లేదని మొన్నటి వరకు అన్నారని, అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ అనర్హత పిటీషన్ల వ్యవహారంపై స్పందించిందన్నారు. రీజనల్‌ పీరియడ్‌లో పరిష్కారించాలని సూచించిన విషయాన్ని కేటిఆర్‌ గుర్తుచేశారు.

మణిపూర్‌ విషయంలో సుప్రీంకోర్టు ఫిరాంయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. ఇక్కడ కూడా స్వీకర్‌ మూడు నెలల కాలంలో ఫిరాయింపుల అంశంపై చర్యలు తీసుకోకపోతే సుప్రీంను ఆశ్రయించక తప్పదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement