Friday, November 22, 2024

America : టెక్సాస్‌లో కార్చిచ్చు… ప్రజలను తరలిస్తున్న అధికారులు…

అమెరికాలోని టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కార్చిచ్చు రెండింతలవడానికి కారణమైందని వాతావరణ శాఖ తెలిపింది. 780 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 2 లక్షల ఎకరాల్లో వృక్షాలు కార్చిచ్చుకు ఆహుతయ్యాయని ఎఅండ్‌ఎమ్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ తెలిపింది.

వీటిలో అతి పెద్ద కార్చిచ్చు స్మోక్‌ హౌస్‌ క్రీక్‌ ఫైర్‌ లక్ష ఎకరాలు, గ్రేప్‌ వైన్‌ క్రీక్‌ ఫైర్‌ 30 వేల ఎకరాలు, విండీ డ్యూసీ ఫైర్‌ 8 వేల ఎకరాలను దహించి వేసింది. కార్చిచ్చు బీభత్సం కారణంగా పలు కౌంటీల్లో ప్రజలను తరలిస్తున్నారు. తూర్పు టెక్సాస్‌, ద మిల్స్ క్రీక్‌, సాన్‌జాసిన్టోల్లో కార్చిచ్చు ఎగిసిపడుతోంది. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చు పరిస్థితిని టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ సమీక్షించారు. ప్రజలు కార్చిచ్చు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement