భార్యాభర్తలు ఇద్దరూ హైదరాబాద్ లోని అమ్మామ్మ ఇంటికి వచ్చారు. ఒక రోజు ఉన్నారు. ఆ తరువాత తమ ఇంటికి వెళ్ళటానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అయితే మంచి నీళ్లు తీసుకుని వస్తానని బయటకు వచ్చిన భార్య మాయమైంది. వివరాల్లోకి వెళ్తే…
రాజస్తాన్ జోద్పూర్ బారీ ఖోకూండ గ్రామానికి చెందిన ప్రభుదాస్ తో పాటు తన భార్య రమ్య , రెండేళ్ల కుమారుడు ప్రకాశ్ లు కలిసి ఈనెల 3న హైద్రాబాద్‌లో ఉంటున్న అమ్మమ్మ కలమ్మ ఇంటికి వచ్చారు. ఆ తరువాత తమ ఇంటికి వెళ్లాలని 4న కుటుంబ సమేతంగా బ్యాగులు సర్ధుకొని ప్రభుదాస్, భార్య రమ్య కుమారుడు ప్రకాశ్‌లు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
అప్పటికే ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రమ్య వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని చెప్పి రెండేళ్ల కుమారుడు ప్రకాశ్ రైల్వే స్టేషన్ ఎదురుగా రొడ్డు వైపు కు వచ్చింది. ఈలోగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఓ ఆజ్ణాత వ్యక్తిపై బైకు తో ఉండగా రమ్య తన కుమారుడితో పరుగెడుతూ ఆ బైకు పై వెళ్లిపోయింది. చాలా సేపటికి తన బార్య రాకపోవడంతో అనుమానం వచ్చి రైల్వే స్టేషన్ ముందు వాకబు చేశాడు.
పరిగెడుతూ ఓ బైక్ పై వెళ్లిపోయిందని స్థానికంగా ఉన్నవాళ్లు చెప్పారు. వెంటనే బాధితుడు భర్త ప్రభుదాస్ గోపాలపురం పోలీసులకు ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు సీసీ పుటేజీను పరిశీలించారు. సిసి పుటేజీలో ఓ ఆజ్ణాత వ్యక్తి బైకుపై వెళుతున్నట్లు కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.