యూపీలో భార్య భర్తల గొడవ పెద్ద హైడ్రామాకు దారి తీసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో లో నివాసముంటున్న హసన్, సాదియా దంపతులు నిత్య గొడవపడుతుండేవారు..ఈగొడవ చిలికిచిలికి గాలివానలా పెద్ద గొడవకు దారితీసింది. దీంతో కోపంతో ఊగిపోయిన సాదియా.. వేగంగా పరిగెత్తి బాల్కనీ తలుపు తీసి అక్కడి నుంచి కిందకు దూకేసింది. అయితే ఆమె వెనుకే వేగంగా వచ్చిన ఫరాజ్.. వెంటనే స్పందించి సాదియా చెయ్యి పట్టుకున్నాడు. దీంతో ఆమె కింద పడకుండా ఆగింది. భార్య చెయ్యి పట్టుకొని ఆమె కింద పడకుండా కాపాడిన ఫరాజ్.. పెద్దగా కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు.
ఇది చూసిన సొసైటీలోని స్థానికులు వెంటనే తమ ఇళ్లలోని పరుపులు, దుప్పట్లు తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కింద పరిచారు. ఇలా కనీసం మూడు నిమిషాల పాటు భార్యను పట్టుకొని ఉన్న ఫరాజ్.. ఆ తర్వాత చెయ్యి జారడంతో ఆమెను వదిలేశాడు. దీంతో 9వ అంతస్తు నుంచి సాదియా కింద పడిపోయింది. పరుపులపై పడినప్పటికీ ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను నోయిడాలోని ఒక ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ ఘటన మొత్తాన్ని సొసైటీలోని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో బుధవారం వైరల్ అవడంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ఊయల తాడు తెగి లోయలో పడ్డారు..