నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్‌ను గురువారం వ్యతిరేకించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఢిల్లి కోర్టు కఠినంగా ప్రశ్నించింది.
”ఎల్‌ఓసి జారీ చేసినప్పటికీ మీరు జాక్వెలిన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు? ఇతర నిందితులు జైల్లో ఉన్నారు. ఆమె విషయంలో మీరు ప్రత్యామ్నాయం ఎందుకు ఎంచుకున్నారు?” అని ఈడీని కోర్టు ప్రశ్నించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనపై కోర్టు రేపు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇంతకుముందు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆమె దేశం విడిచి వెళ్లకుండా ఆపేందుకు ఈడీ ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీచేసింది. పిక్ అండ్ చాయిస్ విధానాన్ని ఎందుకు అవలంబించాలి? అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను కోర్టు ప్రశ్నించింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అక్రమాస్తులు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆమె దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిందని, పరిశోధకులకు సహకరించలేదని, ఆమె తీవ్ర ఆరోపణలను ఎదుర్కొందని బెయిల్ పొందడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టులో ప్రధాన వాదనలు వినిపించింది.
”మా జీవితమంతా మేము 50 లక్షల నగదును చూడలేదు. కానీ జాక్వెలిన్ సరదాకోసం 7.14 కోట్లు వెచ్చించింది. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.” అని ఈడీ పేర్కొంది.