అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియాలో రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడికి జట్టులో స్థానం కల్పించకపోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోహిత్‌కు గాయమైందా అని చాలా మంది భావించారు. కానీ రొటేషన్ పద్ధతిలో విశ్రాంతి కల్పించారు అని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో చాలామంది ఆటగాళ్లను పరీక్షించడానికి టీమిండియా రొటేషన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తర్వాతి మ్యాచ్‌లో మరికొందరు కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోనున్నారు. ఏదైమేనా మ్యాచ్ గెలవడం ముఖ్యమని.. రొటేషన్ విధానంతో ఇప్పటికే టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ నష్టపోయింది గుర్తించాలని బీసీసీఐపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. విశ్రాంతి కావాలని భావిస్తే కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని హితవు పలుకుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement