హైదరాబాద్, ఆంధ్రప్రభ : అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిడెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు, రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టుబడులు పెట్టాయి.
ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలను ఇందుకు ప్రేరేపించిందెవరు. ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సాయం చేశారంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పాల్సిన తీవ్రమైన ప్రశ్నలివని కేటీఆర్ పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు భారత స్టాక్ మార్కెట్లను, అదానీ గ్రూపు షేర్లను కుదిపేస్తున్న విషయం తెలిసిందే.