రైతులకు భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఇవాళ్టి పర్యటన రద్దు చేసుకోవడంపై షర్మిల కేసీఆర్ పై ట్విట్టర్ లో తీవ్రంగా ప్రశ్నించారు.
సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా ? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా ? లేక కరోనా వస్తుందనా ? ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా ? మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు? పంట వానపాలు.. రైతు కష్టం కన్నీటిపాలు.. సాయం దొరమాటలకే చాలు పంట నష్టపోయి, పెట్టిన పెట్టుబడి రాక రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి చనిపోతుంటే, నష్టపోయిన రైతును ఆదుకోడానికి, రైతును ఓదార్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయటపడుతలేదా ? కష్టకాలంలో రైతులకు భరోసా ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ కేసీఆర్ పై షర్మిల ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల చావులకు కేసీఆరే కారణమంటూ షర్మిల దుయ్యబట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..