Saturday, September 28, 2024

చైతూ ఇంటికి సమంత?

అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఎవరి పనుల్లో వారు బిజిగా ఉన్నారు. చైతూ తన సినిమాలతో బిజీగా మారగా.. సామ్ వెకేషన్ లలో ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే విడాకుల తర్వాత సామ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటోంది.. చైతూ, సామ్ ఎంతో ప్రేమగా తీసుకున్న విల్లాలో ఎవరు ఉండబోతున్నారు అనేదానికి క్లారిటీ వచ్చేసింది.

విడాకుల అనంతరం చైతు హైదరాబాద్ లో ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేసి అందులోకి షిఫ్ట్ కానున్నాడు. సామ్ మాత్రం చైతూతో గడిపిన అదే విల్లాలో ఉండ‌బోతోంది. ఇప్పటికే ఆ ఇంట్లో దిగిన సామ్ తన పెంపుడు కుక్కలతో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అయితే చైతూ మాత్రం కొన్నిరోజులు అందరికీ దూరంగా ఉండడం కోసం నాగ్ ఇంటికి కూడా వెళ్లకుండా ఒక హోటల్ లో స్టే చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ కొత్త ఇంట్లో కొన్ని పనులు పూర్తయ్యాక చైతు ఇక్కడికి షిఫ్ట్ కానున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement