Friday, November 22, 2024

క‌రోనా ఇంకా తగ్గలేదు: డబ్ల్యూహెచ్‌వో

కరోనాపై డబ్ల్యూహెచ్‌వో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. క‌రోనా ముగిసిపోయింద‌ని కొంద‌రు భావిస్తున్నారని.. కానీ, ఆ మ‌హ‌మ్మారి నుంచి ప్రపంచం ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసులు, మరణాల గణాంకాలను బయటపెడుతూ.. గ‌త వారం ప్రపంచ వ్యాప్తంగా 31 ల‌క్షల మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలిందని.. మరో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయరని వెల్లడించింది. ఇప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది లేకపోగా… థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉందనే ముందస్తు హెచ్చరికలు కూడా ఉన్నాయి.. కానీ, బయట చూస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంది.. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత క్రమంగా పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి.. కాస్త కేసులు తగ్గుముఖం పట్టగానే.. నిబంధనలు గాలికొదిలేసి ప్రజలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు.. అయితే, కోవిడ్‌ 19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

ఇక, ఇప్పటికే కొన్ని దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ ప్రారంభమైందని.. కోవిడ్‌ బాధితులతో ఆస్పత్రులు అన్నీ నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కానీ, కరోనా నిబంధనలు పట్టించుకోకుండా కొంద‌రేమో విచ్చల‌విడిగా తిరిగేస్తున్నారు.. ఈ రెండేళ్లలో క‌రోనా కాటుకు 50 ల‌క్షల మంది ప్రాణాలు విడిచారని పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో… కాగా, కొన్ని ప్రాంతాల్లో తగ్గిననట్ట తగ్గి మళ్లీ కరోనా రోజువారి కేసులు పెరుగుతోన్న సంగతి తెలిసిందే.. కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. మరికొంతకాలం కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక, వ్యాక్సినేషన్‌తో రక్షణ కలుగుతుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: తెలుగు అకాడమీ కేసు సీపీ అంజనీ కుమార్ వివరణ..

Advertisement

తాజా వార్తలు

Advertisement