కర్ణాటక సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ కూడా ఆమోదించారు. దీంతో కొత్త వ్యక్తిని సీఎంగా తీసుకొచ్చేందుకు పార్టీ నాయకత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక తదుపరి సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనేది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే సీఎం రేసులో పలువురి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఆయన కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఆర్.బొమ్మై కుమారుడు. ఆయనకు సీఎం పదవి ఇవ్వాలని స్వయంగా యడ్యూరప్ప సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం పదవి రేసులో లింగాయత్ వర్గానికి చెందిన మురుగేశ్ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్‌తో పాటు సీటీ రవి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువనేతను సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసే అవకాశముంది.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో కొత్త రాజకీయ చదరంగం