Saturday, November 23, 2024

ఐదు రోజుల క్వారంటైన్‌ చాలు.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కూడా అవసరం లేదన్న డబ్ల్యూహెచ్‌వో

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రస్తుతం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లే మరోసారి ప్రపంచంలోని పలు దేశాల్లో వ్యాప్తిలో ఉన్న నేపథ్యంలో… వైరస్‌ సోకితే 5 రోజుల క్వారంటైన్‌ చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) స్పష్టం చేసింది. వైరస్‌ కట్టడికి విస్తృతంగా కాంటాక్టు ట్రేసింగ్‌ చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. అయితే ప్రతీ ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని లేనిపక్షంలో వ్యాక్సిన్‌ తీసుకోనివాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు, ఒకటికంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, 60ఏళ్లు పైబడిన వారికి వైరస్‌ సోకితే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించింది.

ఈ మేరకు తాజా మార్గదర్శకాలను డబ్ల్యూహెచ్‌వో బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని 69శాతంమందిలో కరోనా ఇమ్యూనిటీ ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్‌లు వైరస్‌ సోకిన తర్వాత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ ప్రబలకుండా మాత్రమే నిరోధిస్తున్నాయని స్పష్టం చేసింది. అయితే వైరస్‌ సోకిన సందర్భంలో వైరస్‌ లోడ్‌ను మాత్రం వ్యాక్సిన్‌లు తగ్గించలేవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ కరోనా జాగ్రత్తలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement