Wednesday, November 20, 2024

బూస్ట‌ర్ డోసు ఇప్పుడే వద్దు: WHO

కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. అయితే కొన్ని ధనిక దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని బూస్టర్ డోసుల వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ బూస్టర్ డోసులను ఇప్పుడే ఇవ్వడంపై WHO వ్యతిరేకిస్తోంది. ఇప్పుడే బూస్ట‌ర్ డోసులు వ‌ద్ద‌ని వారిస్తోంది. ధనిక దేశాలు వ్యాక్సిన్ డోసులు పూర్తిగా పంపిణి చేయగా పేద దేశాలు మాత్రం ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోందన్నారు డ‌బ్ల్యూహెచ్‌వో హెడ్ టెడ్రోస్ అద‌నోమ్. వాళ్ల‌కు వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా త‌గ్గి ఈ ప‌రిస్థితి త‌లెత్తింది అని టెడ్రోస్ చెప్పారు. ఈ ప‌రిస్థితిని మ‌నం అర్జెంటుగా మార్చాలి. ధ‌నిక దేశాల‌కే మెజార్టీ వ్యాక్సిన్లు వెళ్తున్నాయి. ఇప్పుడు మెజార్టీ వ్యాక్సిన్లు పేద దేశాల‌కు వెళ్లాలి. అందుకే క‌నీసం సెప్టెంబ‌ర్ చివ‌రి వర‌కైనా బూస్ట‌ర్ డోసుల‌ను ఆపాలి అని టెడ్రోస్ సూచించారు. ప్ర‌తి దేశం క‌నీసం 10 శాతం జ‌నాభాకు వ్యాక్సిన్లు ఇచ్చే వ‌ర‌కూ బూస్ట‌ర్ డోసుల జోలికి వెళ్లొద్ద‌ని ఆయ‌న అన్నారు. ఆ దిశ‌గా అన్ని దేశాల్లోని ప్రముఖులు ప్ర‌చారం చేయాల‌ని టెడ్రోస్ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Third Wave: చిన్నారులపై ప్రభావం ఆరు రోజులే..!

Advertisement

తాజా వార్తలు

Advertisement