బ్రిటన్, భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలయ్యాయి. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, బ్రిటిష్ ట్రేడ్ సెక్రటరీ అన్నే-మారీ ట్రెవెల్లిన్ మధ్య అధికారిక చర్చలు గురువారం ప్రారంభమయ్యాయి. స్కాచ్ విస్కీపై టారిఫ్‌లు తగ్గించాలని భారత్‌ను బ్రిటన్ కోరింది. భారత సేవల టెక్ రంగాల లభ్యతను మరింత విస్తృతపరచాలని విన్నవించింది. కాగా భారతీయులకు బ్రిటన్ వీసాలకు చౌకగా అందించాలని భారత్ కోరింది. వాణిజ్య అవరోధాలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయాలని భావిస్తున్నట్టు భారత్ అభిలాషించింది. భారత్ – బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యా న్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని భావిస్తున్నట్టు భారత్ పేర్కొంది. వాణిజ్య చర్చల్లో భాగంగా ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనం కలిగించే అంశాలపై ప్రాథమికంగా దృష్టిసారిం చాలని నిర్ణయించాం.
ఏకాభిప్రాయానికి ఎక్కువ అవకాశాలున్న అంశాలపై దృష్టిపెడుతున్నాం. ఇందుకోసం కొన్ని నెలల నిర్దేశిత సమయాన్ని కాలపరిమితిగా నిర్ణయిస్తామని మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలతో వాణిజ్యాన్ని విస్తరిస్తా మని, వృద్ధి తోపాటు ఉపాధి కల్పనకు కొత్త వేదికలను తెరుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశా రు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. ప్రారంభ దశలోనే ఇరు ఆర్థిక వ్యవస్థల మధ్య ఒప్పందం కుదురుతుందని అభిప్రాయపడ్డారు. ఏడాది కాలం లోనే ఈ వాణిజ్య చర్చలను పూర్తి చేస్తామని విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌లో వాణిజ్య చర్చల సందర్భంగా యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్పందించారు. యూకేలో ప్రపంచ స్థాయి వ్యాపారాలున్నాయి.
స్కాచ్ విస్కీ డిస్టలర్ల నుంచి ఫైనాన్సియల్ సర్వీసులు, పునరుత్పాదక సాంకేతికత వరకు అనేక వ్యాపారాలకు నిలయమైనందుకు గర్వంగా ఉందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వర్ధమాన దేశాలకు అవకాశాలను అందిస్తున్నట్టు చెప్పారు. కాగా జపాన్, న్యూజి లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో బ్రిటన్ వాణిజ్య ఒప్పందాలు నిలిచిపోయాయి. వాణిజ్య పరిమాణం అంశాల్లో నష్టాన్ని భర్తీ చేయాలని బ్రిటన్ కోరుతుండడంతో ఇందుకు కారణంగా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital