హైదరాబాద్, ప్రభన్యూస్ : వర్ల్‌పూల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా సరికొత్త నియో ఫ్రెష్ గ్లాస్‌డోర్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల శ్రేణిని అందిస్తోంది. భారతీయ గృహాల కోసం ఎంతో నైపుణ్యంగా రూపొందించిన ఈ రిఫ్రిజిరేటర్ ఒక సౌందర్య రూపం. ఈసందర్భంగా వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కె.జి.సింగ్ మాట్లాడుతూ…. నియోఫ్రెష్ గ్లాస్‌డోర్ శ్రేణి రిఫ్రిజిరేటర్లు వినియోగదారుల జీవితాలు మెరుగుపరిచే, సులభతరం చేసే ఉత్పత్తి అనుభూతి అందించాలనే వర్ల్‌పూల్ డిజైన్ ప్రతిభ, నైపుణ్యానికి ప్రతిరూపంగా నిలుస్తాయన్నారు.
వినియోగదారుల అంచనాల స్వభావం, ఉత్పత్తి ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఆకర్షణీయమైన డిజైన్, స్కాచ్ర్ రెసిస్టెంట్ నాణ్యతకు ఈ శ్రేణి ఒక చిహ్నంగా నిలిచిపోతుందన్నారు. ఇంధన సామర్థం, శక్తివంతమైన పనితీరు, కళ్లార్పకుండా చేసే డిజైన్‌ను ఒక్కచోట చేర్చి మీ కిచెన్ కోసం ఒక శక్తిమంతమైన పరికరాన్ని అందిస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..