Monday, September 16, 2024

Yadagirigutta | ఆల‌య‌ బోర్డు ఏర్పాటుపై… విప్ కృతజ్ఞతలు

ప్రభన్యూస్/యాదగిరి గుట్ట : యాదగిరిగుట్టలో టీటీడీ తరహాలో ఆలయ బోర్డు ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరిగుట్టలో (శనివారం) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ అనుసరించిన విధంగా యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డుకు స్వయంప్రతిపత్తి, విధివిధానాలు ఉండేలా అవసరమైతే చట్టాన్ని సవరించి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి కృషి చేయడం అదృష్టమన్నారు. దీంతో పాటు యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాప‌డం చేసే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ ఇవ్వడం జరిగిందన్నారు.

అలాగే టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. టూరిజంలో భాగంగా యాదగిరిగుట్టలో అన్ని సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేసినందుకు టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి.. పూర్వ వైభవం కోసం పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement