Tuesday, November 19, 2024

ఆ 13 మంది ఎక్కడ..? మీరట్‌లో దొరకని ఆచూకీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో.. ఓ కీలక విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. విదేశాల నుంచి మీరట్‌కు 297 మంది వచ్చారు. అందులో 13 మంది కనిపించకుండా పోయారు. వీరు తప్పుడు ఫోన్‌ నెంబర్లు ఇచ్చినట్టు తేలింది. అదేవిధంగా అడ్రస్‌లు కూడా సరిగ్గా లేవని అధికారులు తెలిపారు. మీరట్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అఖిలేష్‌ మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 13 మంది చిరునామాలు తప్పుగా ఉన్నాయి. వారికి సంబంధించిన విషయాలన్నీ స్థానిక నిఘా విభాగానికి అప్పగించాం. వారిని గుర్తించి పరీక్షలు పూర్తి చేసేందుకు అధికారులు వారి ఇళ్లకు కూడా పంపించాం. మీరట్‌లోని అధికారులు ఈనెల ప్రారంభం నుంచి విదేశాల నుంచి వచ్చిన వారి ఆరా తీస్తున్నాం. ఒమిక్రాన్‌ ద్వారా ముప్పు పొంచి ఉంది.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని అంతర్జాతీయ ప్రయాణికుల కోసం సుభార్తి మెడికల్‌ కాలేజీ, ఎల్‌ఎల్‌ఆర్‌ఎం మెడికల్‌ కాలేజీలో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా వెలుగులోకొచ్చాయి. కర్నాటకలోని అధికారులు విమానాశ్రయం నుంచి తప్పిపోయిన 10 మంది ప్రయాణికులను ట్రాక్‌ చేశారు. దాంతో పాటు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ దక్షిణాఫ్రికా జాతీయుడు ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌ నుంచి కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌ పొందిన తరువాత.. దుబాయ్‌కు పారిపోయాడు. చండీగఢ్‌లో హోం క్వారంటైన్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినందుకు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మహిళపై కేసు నమోదు చేయడం జరిగింది. డిసెంబర్‌ 1న ఆమె వచ్చింది. క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించింది. నెగిటివ్‌ అని తేలినా.. వారం పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ఆమె ఇంటికి వెళ్లకుండా.. హోటల్‌కు వెళ్లడంతో కేసు నమోదైంది. నవంబర్‌ మధ్యలో దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించబడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 దేశాలకు విస్తరించింది. అని వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement