Tuesday, November 19, 2024

కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచేదెప్పుడు? డిమాండ్‌ చేస్తున్న విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు మరింత నాణ్యమైన బోజనం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెంచిన డైట్‌ ఛార్జీల నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయి. అయితే ప్రభుత్వం కేవలం డైట్‌ ఛార్జీలను పెంచి గొప్పలు చెప్పుకోవడం తగదని విద్యార్థి సంఘాల ఆరోపిస్తున్నాయి. ఈ ఛార్జీలు పెంపు అనేది పెరిగిన ధరలతో పోల్చినప్పుడు నామమాత్ర పెంపు మాత్రమే అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆరోపించింది.

- Advertisement -

ఈ పెంచిన ఛార్జీలు కేవలం డైట్‌కు మాత్రమే, కానీ కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచలేదని తెలిపింది. కాస్మోటిక్‌ ఛార్జీలు ప్రస్తుతం నెలకు అబ్బాయిలకు రూ.62, అమ్మాయిలకు రూ.100 ప్రి మెట్రిక్‌ హాస్టల్స్‌లో ఇస్తున్నారని తెలిపింది. ఇవి ఏమాత్రం సరిపోవని పేర్కొంది. కళాశాల విద్యార్థులకు సోషల్‌ వెల్ఫేర్‌లో పాకెట్‌ మనీ పేరుతో కొంత ఛార్జీలు ఇచ్చినా ప్రస్తుతం వాటిని ఇవ్వడంలేదని పేర్కొంది.

అందుకే కాస్మెటిక్ ఛార్జీలు అబ్బాయిలకు నెలకు రూ.500, అమ్మాయిలకు రూ.1000 ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.ఎల్‌మూర్తి, టి.నాగరాజు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కళాశాల వసతి గృహాల విద్యార్థులకు నెలకు రూ.1500 పాకెట్‌ మనీ ఇవ్వాలని వారు ఈమేరకు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement