Friday, November 22, 2024

రేవంత్ రెడ్డి వచ్చాక కులం, ధనం పరిస్థితులు.. దాసోజు శ్రవణ్

రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ అయ్యాక కులం, ధనం అనే పరిస్థితులు వచ్చాయని దాసోజు శ్రవణ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ కాంగ్రెస్ లో అగ్రకుల దురహంకారం నడుస్తోందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమన్నారు. తెలంగాణలో బీసీలు, ఎస్సీలు కాంగ్రెస్ కు దూరమవుతారన్నారు. సొంత పార్టీవాళ్లే కాంగ్రెస్ లోని నేతల్ని బలహీన పరుస్తున్నారన్నారు. సొంత ముఠాతో కాంగ్రెస్ ను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారన్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్, వ్యూహకర్త సునీల్ కుమ్మక్కయ్యారన్నారు. సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు. ప్రశ్నించే వాళ్లపై తప్పుడు నివేదికలు ఏఐసీసీకి ఇస్తున్నారని ఆరోపించారు. వ్యాపార, రాజకీయ లబ్ధి పొందాలన్న దుగ్దే రేవంత్ లో కనిపిస్తోందన్నారు. రేవంత్ రెడ్డే పార్టీని బలహీన పరుస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement