Saturday, November 23, 2024

ప్రపంచ వ్యాప్తంగా భగ్గుమన్న గోధుమ ధరలు.. యూరోపియన్‌ మార్కెట్‌లో డిమాండ్‌..

గోధుమల ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించడంతో.. అంతర్జాతీయ స్థాయిలో గోధుమ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చిలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులకు గోధుమల ఉత్పత్తి.. కేంద్ర ప్రభుత్వం అంచనాను అందుకోలేదు. దీంతో దిగుబడి భారీగా పడిపోయింది. యూరోపియన్‌ మార్కెట్లు ప్రారంభం అవ్వగానే.. గోధుమ ధరలు టన్నుకు 453 డాలర్ల (435 యూరోలు)కు ఎగబాకాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ దేశాలకు గోధుమ ఎగుమతులు నిలిచిపోయాయి. దీనికితోడు ఉక్రెయిన్‌లో పంట ఉత్పత్తి భారీగా పడిపోయింది.

ప్రపంచ స్థాయిలో గోధుమల ఎగుమతి వాటా 12 శాతంగా ఉండేది. ఎరువుల కొరత, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేద దేశాల్లో కరువు, సామాజిక అశాంతి కారణంగా గోధుమ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా భారత్‌ ఉంది. తక్కువ ఉత్పత్తి కావడంతో.. ఎగుమతులపై నిషేధం విధించామని, ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా ధరలు భారీగా పెరిగాయని భారత్‌ అభిప్రాయపడింది. 1.4 బిలియన్‌ ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. మే 13 వరకు తీసుకున్న ఆర్డర్లకు సంబంధించిన ఎగుమతులు మాత్రం పూర్తి చేస్తామని వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement