వాట్సాప్ వెబ్‌కు సంబంధించి మరో సూపర్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. త్వరలో బీటా ప్రోగ్రామ్‌లో భాగంగా మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్ దీంతో మరో అదనపు సౌకర్యాన్ని కల్పించనుంది. ఇంతకాలం ఒకే డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో వెబ్ వాట్సాప్ లాగిన్ జరిగేది. అంతేకాకుండా ఫోన్‌లో డేటా లేదా వైఫై ఆన్ అయి ఉంటేనే వెబ్ వర్షన్ పనిచేసేది. కానీ కొత్త ఫీచర్ ప్రకారం 4 డివైజ్‌లలో వాట్సాప్ లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యాక ఫోన్‌లో ఇంటర్నెట్ లేకున్నా వెబ్ వర్షన్ పనిచేస్తుంది. అయితే బీటా ప్రోగ్రామ్ కావడం వల్ల వాట్సాప్ వాడే సమయంలో మెసేజ్‌ల డిలీట్ లాంటి కొన్ని రెగ్యులర్ ఫీచర్లు పని చేయవు. తర్వాతి రోజుల్లో ఆ ఫీచర్లను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకొస్తుందని తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement