Tuesday, November 26, 2024

వాట్సాప్ కొత్త ఫీచర్.. గ్రూప్ చాట్‌లో హిస్టరీ బ్యాకప్

మెటా మెసేజింగ్ అప్లికేషన్ WhatsApp ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే యాప్‌లలో ఒకటి. మెటా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్ప‌టిక‌ప్ప‌డు కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు వినియోగదారుల కోసం కంపెనీ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మెటా వాట్సాప్ గ్రూప్ ల‌ కోసం.. హిస్టరీకి సంబంధించిన కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.

వాట్సాప్ గ్రూప్‌లో చేరిన కొత్త యూజర్లు ఇప్పుడు ప్రత్యేక సదుపాయాన్ని పొందబోతున్నారు. మెటా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో రీసెంట్ హిస్టరీ షేరింగ్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ బెనిఫిట్స్ వాట్సాప్ గ్రూప్ లో కొత్తగా యాడ్ అయిన‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిన‌ కొత్త వినియోగదారులు.. అదే గ్రూప్ లో ఉన్న‌ పాత చాట్‌లను కూడా చదవగలరు.

అంటే, కొత్త వినియోగదారు ఇప్పుడు తన గ్రూప్ లో చేరడానికి ముందు జరిగిన చాట్‌ను కూడా యాక్సెస్ చేయగలరు. అయితే, ఈ ఫీచర్ నియంత్రణ గ్రూప్ అడ్మిన్‌కి ఉంటుందని తెలుస్తోంది. అడ్మిన్ ఈ ఫీచర్‌ను ఆన్‌లో ఉంచినట్లయితే, కొత్త వినియోగదారు పాత చాట్‌లను చదవగలుగుతారు. కాగా, ప్రస్తుతం, ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement