వాట్సాప్ విండోస్ యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు ఇక నుంచి నచ్చినట్లు టెక్ట్స్ సైజ్ సరిచేసుకునేలా కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ విండోస్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. వాట్సాప్ చాట్‌లో టెక్ట్స్ సౖౖెజ్‌ను సరిచేసుకునేందుకు సెట్టింగ్స్‌లో పర్సనల్ సెక్షన్‌లోకి వెళ్లి టెక్ట్స్ సైజ్ మార్చుకోవచ్చు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ ఫీచర్‌తో యూజర్లు డెస్క్‌టాప్ స్క్రీన్‌పై తమకు నచ్చిననట్లుగా టెక్ట్స్ సైజ్‌ను పెంచుకోవచ్చని తెలిపింది.
యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త అప్‌డెట్‌లతో వాట్సాప్ అందిస్తుందని తెలిపింది. ఇటీవల వాట్సాప్ వీడియో కాల్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనేలా కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. రానున్న రోజుల్లో చాట్‌లను ఈజీగా వెతుక్కోవడానికి వీలుగా చాట్ ఫిల్టర్లను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఆన్‌రీడ్ మెసేజ్‌లు, వ్యక్తిగత సంభాషణలు, బిజినెస్ సంభాషణల విభాగాలుగా ఉండేలా ఫిల్టర్ చాట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.