Friday, November 22, 2024

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ నిలిచిపోవడానికి కారణమిదే..

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రమ్ సేవలు సుమారు 50 నిమిషాల పాటు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కారణమేంటో తెలియక చాలామంది మొబైల్ నెట్‌వర్క్ కస్టమర్ కేర్ ఆఫీసులకు ఫోన్‌లు చేశారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ సేవల్లో అంతరాయంపై దాని మాతృసంస్థ ఫేస్‌బుక్ స్పందించింది. సాంకేతిక లోపం వల్లే అలా జరిగిందని వెల్లడించింది. వినియోగదారులకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నామని పేర్కొంది. ప్రపంచమంతటా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. అయితే సేవలకు అంతరాయానికి గల కచ్చితమైన కారణాన్ని వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement