కేంద్రం తెచ్చిన కొత్త మధ్యంతర మార్గదర్శకాలపై వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం తెచ్చిన మార్గదర్శకాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ఉన్నాయని, ఖాతాదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తాయని ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం కొన్ని పోస్టులను అసలు ఎవరు మొదట పెట్టారో చెప్పాలనడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్ సందేశాలన్నీ ఇద్దరి మధ్య మాత్రమే ఉంటాయి… ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ట్ విధానంతో వాట్సాప్ పనిచేస్తుందని, కానీ ఇప్పుడు ఫస్ట్ మెసెజ్ చేసిందెవరో చెప్పాలనడం కంపెనీ ప్రైవసీ నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేసింది. కాగా వాట్సాప్‌కు ఇండియాలో 400మిలియన్ల యూజర్లు ఉన్నారు. కేంద్ర నిబంధలపై వాట్సాప్ కోర్టుకెక్కిన విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ధృవీకరించింది. ఫేస్ బుక్ మాతృసంస్థగా వాట్సాప్ కొనసాగుతుంది. అయితే దీనిపై వాట్సప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.