చంద్రబాబు వారిని హేళన చేస్తున్నారు
చట్ట సభలలో వారు కూర్చోకూడదా
విద్యావంతుడైన డ్రైవర్ కే సీటు ఇచ్చా..
వాహన మిత్ర పథకంలో ఆటో కార్మికులకు ఆండ
సింగనమల – చట్టసభలలో డ్రైవర్లు, ఆటో కార్మికులు ఉండకూడదా అంటూ వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ టిటిపి అధినేత చంద్రబాబుని ప్రశ్నించారు.. మేము సిద్దం బస్సు యాత్రలో భాగంగా ఆయన నేడే చిన సింగనమలలో ఆటో కార్మకులతో భేటి అయ్యారు.. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మాట్లాడుతూ… టిప్పర్ డ్రైవరు చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్ ఇచ్చానని అన్నారు. ఎంఏ ఎకనామిక్స్, బీఈడీ చదివి డ్రైవర్ గా పని చేస్తున్న వీరాంజనేయులు ఈసారి ఘనం విషయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా బాధపడని వీరాంజనేయులు ఉపాధి కోసం టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడన్నారు.. ఆ పని చేయడం తప్పా అని ప్రశ్నించారు.. టిప్పర్ డ్రైవరుకు టికెట్ ఇచ్చాడని చంద్రబాబు అవహేళన చేశారని, అటువంటి నేతకు ఆటో కార్మికులు ఓటుతో తగిన బుద్ది చెప్పాలంటూ పిలుపు ఇచ్చారు..ఈ ఎన్నికలలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారని, తామ మాత్రం నిరుపేదలకు సైతం అవకాశం కల్పించామన్నారు..
వాహన మిత్రతో అండ..
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.. దీని వల్ల ఎంతో మంది ఆటో కార్మికుల జీవితాలు మెరగయ్యాయని చెప్పారు జగన్. ఏడాది రూ.10వేల చొప్పున, ఐదేళ్లలో రూ.50వేలు ఇచ్చామన్నారు.
వాహనమిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు.. తాము ఎప్పుడూ ఆటో, ట్యాక్సి, టిప్పర్ డ్రైవర్ల, కార్మికులకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు..
వైసిపిలో చేరిన టిడిపి నేత..
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఎద్దల చెరువు వద్ద జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో వైయస్ఆర్ సీపీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నా అన్నారు. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరినీ కలవలేకపోయాం అని బాధపడవద్దు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్ అని ప్రస్తావిస్తూ.. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6వ తేదీన కావలిలో “కావలి సిద్ధం” సభ కూడా మీ దగ్గరే జరుగుతుంది. మీ అందరినీ ఆరోజు కలుస్తానని అన్నారు.