కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాల్చినా హైదరాబాద్ మహానగరంలో వైరస్ కట్టడి దిశగా కనీస చర్యలు తీసుకునే ఆలోచన కూడా అధికారులు చేయడం లేదు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వైరస్వ్యా ప్తి నియంత్రణకు కృషి చేయాల్సిన జీహెచ్ఎంసీ పూర్తిస్థాయిలో ఆ అంశాలపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతస్థాయి అధి కారుల ఆదేశాలతో నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వేలో భాగస్వాములవుతు న్నప్పటికీ ఇతరత్రా విషయాలను అంతగా పట్టించుకోవడం లేదు. వైరస్ వ్యాప్తికి పకడ్బందీగా తీసుకోవాల్సిన చర్యలేంటన్నది గ్రేటర్ అధికారులకు అసలే పట్టడం లేదని వినిపిస్తోంది.
ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయడం తప్ప ప్రస్తుతం సంస్థలో సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ లో పరిస్థితులెలా ఉన్నాయన్నది క్షేత్రస్థాయి అధికారులకు తెలుస్తుం ది. ఒక ఇంట్లోఒకరికి పాజిటివ్ వస్తే ఎంతమందిపై ప్రభావం పడుతుందన్నది గుర్తించే అవకాశం జీహెచ్ఎంసీ,వైద్య ఆరోగ్య శాఖలకు ఉంది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే కుటుంబసభ్యులతో పాటు సన్నిహితంగా ఉన్నవారు క్వారంటైన్లో ఉండేలా చూసి వ్యాప్తి నిరోధించేలా చూడాలి. కానీ అలా జరగడం లేదు.