Saturday, November 16, 2024

ఫీజులపై నియంత్రణేది? మోతమోగిస్తున్న ప్రైవేట్‌ స్కూళ్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వామ్మో ఇంత ఫీజులా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్ని స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్యలో వసూళ్లు చేస్తున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ఇంకా ఎనిమిది రోజులే ఉండడంతో ప్రైవేట్‌ స్కూళ్లు అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లో నైతే అప్పుడే అడ్మిషన్లు అయిపోయినట్లు సమాచారం. తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం, కార్పొరేట్‌ చదువులు చెప్పించాలనే ఉద్ధేశ్యంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం రూపకల్పనకు ఐదు నెలల క్రితమే కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగానూ మంత్రులతో సబ్‌కమిటీని కూడా నియమించారు. అందులో భాగంగానే ఫీజుల నియంత్రణపై ఇప్పటికే ఈ కమిటీ పలుమార్లు సమావేశమైంది. ఈ సమావేశాల్లో గతంలో ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులపై చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రతి ఏటా 10 శాతం ఫీజు పెంచుకోవచ్చనే ప్రతిపాదన చేసింది. ఫీజుల వివరాలను ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కావొస్తున్నా ఇంతవరకూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఫీజుల నియంత్రణ చట్టంపౖౖె స్పష్టతే లేదు. ఫీజులు ఎంత వసూలు చేయాలో? లేదో? అనేదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఏవని పలు విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్‌ అసోసియేషన్స్‌, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. గతేడాది ఆన్‌లైన్‌ క్లాసులకు రూ.వేలు, లక్షల్లో ఫీజులు కట్టించుకున్న కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు.. ప్రస్తుతం జూన్‌ 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకావొస్తుండటంతో ఆ నష్టాన్ని ఈసారి రాబట్టాలనే నయా దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫీజులను కడితెనే ఈ ఏడాదికి తరగతులకు అనుమతిస్తామనే నిబంధనలు కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం ఫీజు కట్టాలనే నిభంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడంలేదు.

అన్ని తమ వద్ద కొనాల్సిందే…

తెలంగాణలో దాదాపు 11 వేల వరకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 30 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో తరగతిని బట్టి రూ.15వేల నుంచి రూ.4 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు అంచానా. కరోనా సమయంలో ఫీజులు ఒకేసారి వసూలు చేయకుండా ట్యూషన్‌ ఫీజులను, నెలవారి ఫీజులను మాత్రమే తీసుకోవాలని గతేడాది ఏప్రిల్‌లో జీఓ నెం.46ను ప్రభుత్వం విడుదల చేసినా కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు దానిని పట్టించుకోలేదు. అడ్మిషన్‌, టర్మ్‌, ట్యూషన్‌ ఫీజులంటూ ప్రజల నెత్తిమీద కుచ్చుటోపీ వేస్తున్నాయి. యూనిఫామ్స్‌, బుక్స్‌, నోట్‌ పుస్తకాలకు ఇబ్బడి ముబ్బడిగా బిల్లులు వేసేస్తున్నారు. ఇవన్నీ తమ వద్దే కొనాలని హుకూం జారీ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కార్పొరేట్‌ స్కూళ్లు ప్రభుత్వం నిర్ధేశించిన పాఠ్య పుస్తకాలను కాకుండా వారు రూపొందించిన పాఠ్యపుస్తకాల ద్వారా బోధన చేస్తున్నారు. వాటినే తమ పాఠశాలల్లోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల నోటు పుస్తకాలు, యూనిఫాం తమ వద్దనే కొనాలని ఆదేశిస్తూ చివరకు ఫీజు కట్టడం తప్పనిసరి చేస్తున్నాయి.

ఈ నిబంధనలు ఎక్కడ?

ఏదైనా ప్రాంతంలో కొత్త స్కూల్‌కు అనుమతి ఇవ్వాలంటే అక్కడ విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పాఠశాలకు మరోక స్కూల్‌కు నిర్ధేశించిన దూరం ఉండాలి. తరగతి గదిలో ఒక్కో విద్యార్థికి 6 నుంచి 8 చదరపు అడుగుల స్థలం ఉండాలి. సిబ్బందికి కూడా సరిపోయే స్థలం ఉండాలి. లైబ్రరీ, ల్యాబ్‌లు, విద్యార్థులకు, సిబ్బందికి టాయ్‌లెట్స్‌ ఉండాలి. మంచి నీటి సౌకర్యం కల్పించాలి. పాఠశాలలకు ఆటస్థలం లేకున్నా ఆ చుట్టుపక్కల ఉండే గ్రౌండ్లను ఉపయోగించుకునే విధంగా ఒప్పందం చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో పాఠశాల జోన్‌లో జీబ్రా క్రాసింగ్‌కు అయ్యే ఖర్చును పాఠశాలలే భరించాలి. ఇలా ప్రభుత్వ నిబంధనలు అన్ని పాటిస్తే సంబంధిత విద్యాశాఖ అధికారులు స్కూల్‌ను పరిశీలించి స్కూల్‌కు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ గుర్తింపుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ న…

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement