Friday, November 22, 2024

సింధుకు ఏమైంది..!? సెమీస్ గండం దాట‌ని తెలుగుతేజం..

ప్ర‌భ‌న్యూస్ : భార‌త్ స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధుకు మ‌రో ప‌రాభావం. రెండేండ్లుగా ఒక్క టోర్నీ కూడా తెలుగుతేజం సింధు నెగ్గ‌లేదు. ఒలింపిక్స్ త‌రువాత వ‌రుస‌గా మూడో సెమీస్‌లోనూ ఓట‌మి చ‌విచూసింది. డ‌బుల్ ఒలింపిక్ ప‌త‌క విజేత‌, భార‌త్ స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఇండోనేషియా టోర్నీలో ఓట‌మి పాలైంది. మేజ‌ర్ టోర్నీల్లో సెమీస్ గండాన్ని దాట‌లేక చ‌తికిల‌ప‌డుతోంది. ఇండోనేషియా మాస్ట‌ర్స్ సూప‌ర్ 750 టైటిల్‌పై క‌న్నేసిన మూడో సీడ్ సింధు.. సెమీస్‌లో రెండో సీడ్ థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతాన్ ర‌చ‌నోక్ చేతిలో ఓడిపోయింది. మ‌హిళ‌ల సింగిల్స్‌లో భాగంగా 27న జ‌రిగిన సెమీ ఫైన‌ల్లో సింధు 21-15, 9-21, 14-21 పాయింట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది.

తొలి సెట్ గెలుచుకున్న సింధు.. విజ‌యం త‌న‌దే అనుకుంది. కానీ ఇదే స‌మ‌యంలో ర‌చ‌నోక్ అద్భుతంగా రాణించి. వ‌రుస‌గా రెండు సెట్లు గెలిచి సింధును ఓట‌మి ఊబిలోకి నెట్టేసింది. ఒలింపిక్స్ త‌రువాత సింధుకు ఇది వ‌రుస‌గా మూడో ఓట‌మి. కాగా 2019 స్విట్జ‌ర్లాండ్ ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్లో విజేత‌గా నిలిచిన త‌రువాత‌.. సింధు మ‌ళ్లీ టైటిల్ నెగ్గ‌లేదు. ఇటీవ‌ల ముగిసి టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య‌మే సింధుకు మేజ‌ర్ టైటిల్‌. ఆ త‌రువాత నిర్వ‌హించిన డెన్మార్క్ ఓపెన్‌, ఫ్రెంచ్ ఓపెన్‌, ఇండోనేషియా ఓపెన్ టోర్నీల్లో సింధు ఓట‌మి పాలైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement